Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ధర్నాకు పవన్ అనుమతి తీసుకున్నాం: జనసేన నేత మహేష్

ఏపీకు ప్రత్యేక హోదా కోసం విజయవాడలో చేస్తున్న ధర్నాపై పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ కు ముందుగానే సమాచారం ఇచ్చామని జనసేన నేత మహేష్ తెలిపారు. అందుకు ఆయన అనుమతి ఇచ్చారని చెప్పారు. త్వరలో పవన్ కూడా హోదాపై ఉద్యమిస్తారని వివరించారు. విజయవాడలోని కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్ వద్ద జనసేన కార్యకర్తలు ఈరోజు ఆందోళన చేపట్టారు. రాష్ట్రానికి తక్షణమే బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ తో నినాదాలు చేస్తున్నారు.

More Telugu News